ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీజేపీ, బీఆర్ఎస్ నాటాకాలాడుతున్నాయని టీపీసీసీ చీప్ రేవంత్ రెడ్డి విమర్శించారు. కవితను జైలుకు పంపి వచ్చే ఎన్నికల్లో సింపతి కొట్టేయాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వంపై ఈ రోజు వరకు ఈడీ, సీబీఐ కాదు.. ఈగ కూడా వాల లేదన్నారు. మోడీ, అమిత్ షా, నడ్డా విమర్శలు చేస్తారు కానీ.. ఒక్క కేసు కూడా పెట్టలేదన్నారు. కేసీఆర్ అవినీతిపై బీజేపీ ఎందుకు విచారణ జరపలేదన్నారు. కేసీఆర్ కిషన్ రెడ్డి వేర్వేరు కాదని.. కేసీఆర్ అనుచరుడే అని వ్యాఖ్యానించారు.
ALSO READ: పబ్లిక్ గార్డెన్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం కేసీఆర్
ఎన్నికల్లో గెలవడానికి బీఆర్ఎస్.. బీజేపీతో ఒప్పందం చేసుకుందని.. దాని కోసమే కవితను జైలుకు పంపేందుకు కేసీఆర్ సిద్ధంగా ఉన్నారని చెప్పారు రేవంత్. కాంగ్రెస్ పై మాట్లాడే అర్హత బీఆర్ఎస్ కు లేదన్నారు. పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు ఖర్చుల కన్నా దానికి చేసిన ప్రకటనల ఖర్చే ఎక్కువని చెప్పారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులు చెయ్యకుండానే ప్రారంభించడం ఏంటని ప్రశ్నించారు. కాళేశ్వరం సరిపోలేదని.. కేసీఆర్ కుటుంబం ఢిల్లీ లిక్కర్ స్కాంకు పాల్పడిందన్నారు. వంద కోట్లు తిన్న మంత్రులను జైల్లో పెడ్తే.. లక్ష కోట్లు తిన్న కేసీఆర్ ను ఉరి తీయాలని చెప్పారు.