సీఎం కేసీఆర్ ముంబై పర్యటన ఓ డ్రామా అని అన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. టీఆర్ఎస్, బీజేపీల మధ్య విభేదాలున్నాయని జనాలకు చెప్పే ప్రయత్నం చేశారన్నారు. రాఫెల్ నుండి మొదలు కేంద్రమంత్రుల అవినీతి అక్రమాల ఆధారాలు తన దగ్గర ఉన్నాయన్నారు. త్వరలోనే కేసీఆర్ కుటుంబం జైల్లో ఉంటదన్నారు. కేసీఆర్ .. సుపారీ గ్యాంగ్ లీడర్ అని అన్నారు రేవంత్.. కేసీఆర్.. జగన్, కేజ్రీవాల్, ఇతర నేతలను ఎందుకు కలవడం లేదన్నారు. మోడీ, అమిత్ షా ఎందుకు కేసీఆర్ అవినీతిపై ముందుకు రావడం లేదని ప్రశ్నించారు రేవంత్.
సింగరేణి సంస్థలో 51 శాతం రాష్ట్ర వాటా, 49 శాతం కేంద్రం వాటా ఉందన్నారు. 50వేల మంది గని కార్మికులకు ఉద్యోగులకు అండగా ఉంటుందన్నారు. సింగరేణిని 25 ఏళ్ళు లీజ్ కు ఇవ్వడానికి కేసీఆర్ తన అధికారాన్ని వినియోగించి ప్రైవేట్ పరం చేసే కుట్ర చేశారన్నారు. ఒరిస్సా లోని నైనా బొగ్గు గనిని లీజ్ కు ఇవ్వడం జరిగిందన్నారు. ఐఏఎస్ శ్రీధర్ .. సింగరేణి సంస్థకు సీఎండిగా శ్రీధర్ ఉన్నారని.. నిబంధనలకు విరుద్దంగా శ్రీధర్ కొనసాగుతున్నారన్నారు. వేలాది కోట్ల రూపాయల అవినీతి జరుగుతుందన్నారు. రాఫెల్ కుంభకోణం కంటే ఇది పెద్దదన్నారు. రాఫెల్ రూ. 35వేల కోట్లు ఐతే.. ఇది రూ. 50వేల కోట్ల కుంభకోణమని అన్నారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దీనిపై ప్రధానికి, హోమ్ , విజిలెన్స్ , కోల్ మినిస్టర్, కోల్ సెక్రెటరీ వరకు ఫిర్యాదు చేశామన్నారు. ఇంత పెద్ద టెండర్ ని ఎవరికీ దక్కకుండా చేస్తున్నారన్నారు. ఆదానికి టెండర్ దక్కితే.. ఆయన ఎవరికైనా ఆర్ధిక పెట్టుబడి దారికి అవకాశం కల్పించవచ్చ్నారు.
అదానీ..ప్రధాని మోడీ మనిషి ఐతే.. ప్రతిమ శ్రీనివాస్ కేసీఆర్ బినామీ రూపంలో నైని సంస్థల్లోకి ఎంట్రీ కాబోతున్నారన్నారు. వెస్ట్ బెంగాల్ లో డీజేపీపై చర్య తీసుకున్న కేంద్రం.. శ్రీధర్ పై ఎందుకు చర్యలు చేపట్టడం లేదన్నారు. శ్రీధర్ పై తీవ్ర ఆర్ధిక ఆరోపణలున్నా .. బీజేపీ నాయకులు ఎందుకు మాట్లాడటం లేదన్నారు. మొన్నటి వరకు మోడీ కేసీఆర్ కలిసి దోచుకుంటే..ఇవాళ విడిపోయి దోచుకునే కుట్ర జరుగుతోందన్నారు రేవంత్.