మంత్రి కేటీఆర్ పై TPCC చీఫ్ రేవంత్ రెడ్డి మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ ఓ డ్రామారావ్ అంటూ రేవంత్ విమర్శించారు. సరైన సమాచారం లేని మంత్రి కేటీఆర్ మొన్న ఆరేళ్ల చిన్నారిపై అఘాయిత్యం జరిగినప్పుడే సరిగ్గా స్పందించి ఉంటే...ఇవాళ (గురువారం) మంగళ్ హాట్‌లో 9 ఏళ్ల పాపపై మరో మృగాడు అఘాయిత్యానికి ప్రయత్నించకపోయేవాడు కాదన్నారు.
తెలంగాణలో ఇప్పటివరకు TRS పాలించిన ఏడేళ్లలో చిన్నారులపై లైంగిక వేధింపుల కేసులు 300శాతం పెరిగాయని.. ఇది మీ పాలన అని రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ఇందుకు సంబంధించిన పలు మీడియా క్లిప్‌లను కూడా తన ట్వీట్‌కు రేవంత్ రెడ్డి జత చేశారు.