భూపాలపల్లిలో కాంగ్రెస్ కార్యకర్తలు గెలిపించిన ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి...దొరగడీలో గడ్డి తినేందుకు పార్టీ ఫిరాయించారని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ కార్యకర్తల అభిమానాన్ని తాకట్టు పెట్టిన పార్టీ ఫిరాయించిన సన్నాసులకు బుద్ది చెబుదామన్నారు. వంద మందిని తీసుకొచ్చి కాంగ్రెస్ సభ మీద దాడి చేయించిన వెంకటరమణారెడ్డి..దమ్ముంటే నువ్వే రావాలని సవాల్ విసిరారు. కిరాయి వాళ్లను పంపించి వేషాలు వేస్తున్నవా..? అని ప్రశ్నించారు.
తాను అనుకుంటే భూపాలపల్లిలో ఊర్విశి థియేటర్ కాదు...భూపాలపల్లిలో వెంకటరమణారెడ్డి ఇళ్లు కూడా ఉండదని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. రెండు పార్టీలు ఒకే రోజు సభ పెట్టొద్దని ఆ రోజు యాత్రకు విరామం ఇచ్చామన్నారు. కానీ ఇవాళ తమపై దాడులు చేస్తుంటే పోలీసులు అడ్డుకోకుండా చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. భూపాలపల్లి ఎస్పీ ..ఎమ్మెల్యే చుట్టమనే ఇలా వ్యవహరించారా..? అని నిలదీశారు. భూపాలపల్లి గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరేయాలని..ఆ దిశగా కాంగ్రెస్ కార్యకర్తలు కృషి చేయాలన్నారు.