బీహార్ అధికారులే రాష్ట్రాన్ని శాసిస్తున్రు

సీఎం కేసీఆర్.. బీహార్ అధికారులను గుప్పిట్లో ఉంచుకుని రాష్ట్రాన్ని దోచుకుంటున్నారన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కీలక శాఖల్లో బీహారీ ఐఏఎస్ లు, ఐపీఎస్ లే  ఉన్నారన్నారు.  నీటి పారుదల శాఖ కమిషనర్ , స్పెషల్ సీఎస్ రజత్ కుమార్, మున్సిపల్ శాఖ అరవింద్ కుమార్, ఐటీ చూసే జేయేఎస్ రంజన్ , సందీప్ సుల్తానియా.. వీళ్ళే  రాష్ట్రాన్ని శాసిస్తున్నారన్నారు. ఇక్కడి ప్రాంత ఐఏఎస్ లకు అన్యాయం జరుగుతోందన్నారు. 157 మంది ఐఏఎస్ లలో ప్రతిభావంతులు లేరా అని ప్రశ్నించారు. ఒక్కో అధికారి కింద ఐదారు శాఖలున్నాయన్నారు. కేసీఆర్ మూలాలు బీహార్ లో ఉన్నాయని మరోసారి రుజువైందన్నారు.  

సీఎం, సీఎస్ కలిసే ధరణి తెచ్చామన్నారు. ధరణి పోర్టల్ లో మొత్తం తప్పులే ఉన్నాయన్నారు.  ధరణి లోపాలతో చాలా చోట్ల గొడవలు జరుగుతున్నాయన్నారు. ప్రభుత్వ తప్పిదాలతోనే  హత్యలు జరుగుతున్నాయన్నారు. నిన్ననే ఇబ్రహీంపట్నంలో ఇద్దరి రియల్టర్ల హత్య జరిగందన్నారు. ధరణి పోర్టల్ లో లోపాలతోనే ఈ హత్యలు జరుగుతున్నాయన్నారు. హైదరాబాద్ చుట్టు పక్కల భూములు కాజేస్తున్నారన్నారు.రెవెన్యూ అధికారులు  పాత యజమానులకే  పట్టాలిచ్చారన్నారు. వేల కోట్ల భూ కుంభకోణాలకు పాల్పడుతున్నారన్నారు. 20ఏళ్ల క్రితం ఉన్న భూ యజమానులు పేర్లు ధరణిలో  వస్తున్నాయన్నారు. దీంతో  భూమి కొన్న ఓనర్లు ఆగమై హత్యలకు గురవుతున్నారన్నారు.  జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు రజత్ కుమార్ 30 లక్షల ఓట్లు తొలగించారన్నారు. అందుకే ఇరిగేషన్ శాఖకు ట్రాన్స్ ఫర్ చేశారన్నారు.  అరవింద్ కుమార్ మున్సిపల్ శాఖను ఆగం చేస్తుండన్నారు.  అరవింద్ కుమార్, కేటీఆర్ కలిసి  బిల్డింగ్ అనుమతుల్లో ఎన్ని కోట్లు దండుకుంటున్నారో త్వరలోనే బయట పెడతామన్నారు. ఐపీఎస్ అంజన్ కుమార్ కూడా ఏపీ క్యాడరేనని ఇక్కడ ఎవరూ లేనట్లు బీహార్ ఐపీఎస్ అధికారికి డిజిపి పదవి కట్టబెట్టారన్నారు. వీళ్ళే కాదు.. ఎన్నికల వ్యూహకర్త కూడా పీకే బీహార్ వాడేనన్నారు. తెలంగాణ మూలలను కేసీఆర్ కాలరాస్తున్నారని..ఇది తెలంగాణ ఉనికికే  ప్రమాదమన్నారు.

సోమేశ్ కు సీఎస్ అయ్యే అర్హత లేదు

సీఎస్ అయ్యే అర్హత లేకున్నా సోమేష్ కుమార్ ను సీఎస్ చేశారన్నారు రేవంత్.  సోమేశ్ కుమార్ 1997 నుంచి 1999 వరకు ఐఏఎస్ పదవిని వదిలి ఐటీ కంపెనీలో పనిచేశారన్నారు. ఇలా రెండు మూడు సార్లు జాబ్ మానేశాడని..1989 నుండి 2020 వరకు ఏడేళ్లు సర్కార్ పోస్టుల్లో పనిచేయలేదన్నారు. సీఎస్ కు అర్హత లేదని.... ప్రిన్సిపల్ సెక్రెటరీ హోదాకే అర్హత ఉందన్నారు. సోమేశ్ కుమార్ ఇన్ఫర్మేషన్ కావాలని  ఆర్టీఐ కింద వేసిన ఇవ్వడం లేదన్నారు.  2017 నుంచి 22 వరకు సోమేశ్ కుమార్ పై కేసు ఉన్నా కోర్టుల్లో వాదనలు జరగడం లేదని.. అందర్నీ మేనేజ్ చేస్తున్నాడన్నారు. సర్కార్ న్యాయవాదులు కూడా మాట్లాడడానికి ముందుకు రావడం లేదన్నారు. సోమేశ్ కుమార్ కేంద్ర, రాష్ట్ర సర్కార్ ల ను మేనేజ్ చేస్తున్నాడన్నారు.