తెలంగాణకు పట్టిన చీడ, పీడ వదలాలంటే కోదండరాం మద్దతు అవసరం: రేవంత్ రెడ్డి

తెలంగాణకు పట్టిన చీడ, పీడ వదలాలంటే కోదండరాం మద్దతు అవసరం: రేవంత్ రెడ్డి

తెలంగాణకు పట్టిన చీడ, పీడ వదలాలంటే కోదండరాం మద్దతు అవసరమని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ జన సమితి, కాంగ్రెస్‌ కలిసి పనిచేస్తాయని చెప్పారు. కాంగ్రెస్‌తో కలిసి పని చేయడానికి కోదండరాం సుముఖత చూపారని తెలిపారు. 

కోదండరాం మద్దతు కోరామన్నారు. ఎన్నికల్లో తెలంగాణ జన సమితి పోటీకి దూరంగా ఉంటుందని రేవంత్ రెడ్డి వివరించారు.

Also Read :- పదేళ్లలో కేసీఆర్ లక్ష కోట్ల ఆస్తులు సంపాదించారు 

కేసీఆర్‌ కుటుంబం నుంచి తెలంగాణకు విముక్తి కల్పించాలని రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. సమన్వయ కమిటీ ఏర్పాటు చేసి ముందుకెళ్తామన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక తెలంగాణ జన సమితిని ప్రభుత్వంలో భాగస్వామ్యం చేస్తామని రేవంత్‌ రెడ్డి వెల్లడించారు. పదేళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై కోదండరాం పోరాడుతున్నారని రేవంత్ రెడ్డి అన్నారు.