రాజకీయాలంటే కొనుగోలు, అమ్మకాలుగా మారాయని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్, బీజేపీలు డబ్బుతో రాజకీయం చేస్తున్నాయని మండిపడ్డారు. ఎన్ఎస్యూఐ రూపొందించిన ప్రజాస్వామ్య పరిరక్షణకై పాదాభివందనం పోస్టర్ ను ఆయన విడుదల చేశారు. కాంగ్రెస్ అనుబంధ విభాగాల్లో ఎన్ఎస్యూఐ కీలకంగా పనిచేస్తుందని.. విద్యార్ధి సమస్యలతోపాటు ప్రజాసమస్యలపై పోరాడుతోందన్నారు. మునుగోడులో కూడా ఎన్ఎస్యూఐ పనిచేయడానికి సిద్ధమైందని చెప్పారు.
ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు కాంగ్రెస్ నడుం బిగించిందని రేవంత్ రెడ్డి తెలిపారు. విద్యార్ధి నేతలతో దండుకట్టి మునుగోడు ప్రజల వద్దకి పంపుతున్నామన్నారు. మా వద్ద సొమ్ము లేదు, అమ్ముడు పోయే వాళ్ళం కాదని ప్రజలకు వారు వివరిస్తారని తెలిపారు. లక్షమంది ఓటర్ల కాళ్ళు మొక్కి ప్రజాసౌమ్యాన్ని రక్షించాలని వేడుకుంటారని చెప్పారు. ఈ ప్రోగ్రాం ద్వారా మోడీ , కేసీఆర్ దిమ్మతిరగాల్సిందేనన్నారు. నెహ్రు నుండి రాహుల్ వరకు ఐదు తరాలు దేశం కోసం పనిచేస్తున్నారని..దేశం కోసం గాంధీ కుటుంబం ప్రాణత్యాగాలు చేశారని వ్యాఖ్యానించారు.ప్రశ్నించే గొంతుకు ఓటు వేయాలని మునుగోడులో కోరుతామన్నారు