ప్రభుత్వంపై సీబీఐ ఎంక్వైరీ వేయాలి

మిల్లర్లు, దళారులు, ప్రభుత్వం కలిసే రూ. 2,600  కోట్ల విలువైన బియ్యాన్ని మాయం చేశారన్నారు. బియ్యం మాయం చేసిన ప్రభుత్వంపై సీబీఐ ఎంక్వైరీ వేయాలన్నారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు కాంగ్రెస్ ను కలిశారు. 11 అంశాలపై గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి  బీజేపీ, టీఆర్ఎస్ డ్రామాలాడుతున్నాయన్నారు. గల్లిలో ప్రభుత్వం నడిపే వాళ్లు ఢిల్లీలో ధర్నా చేస్తున్నారని..ఢిల్లీలో  ప్రభుత్వం నడిపేవాళ్లు..గల్లిలో ధర్నా చేస్తున్నారన్నారు.

తమ ఉద్యమంతోనే వడ్ల కొనుగోళ్లపై కేసీఆర్ దిగొచ్చారన్నారు.  సిగ్గులేకుండా తమ విజయమని బీజేపీ వాళ్లు చెప్పుకుంటున్నారన్నారు. ఇప్పటిదాకా నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలన్నారు. మిల్లర్ల దగ్గర పంట అమ్మిన రైతుల వివరాలు తీసకుని డబ్బులివ్వాలన్నారు.  సంసద్ నుంచి సడక్ దాకా వడ్లపై కాంగ్రెస్ కొట్లాడిందన్నారు. రైతులెవరూ అగ్గువకు ధాన్యం అమ్ముకోవద్దన్నారు. రూ. 11 వేల కోట్ల ఆస్తులను  కొల్లగొట్టేందుకు 111 జీవో ఎత్తేస్తున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కౌలు రైతులకు రైతుబంధు ఇస్తామన్నారు. కౌలు రైతులకు రుణమాఫీ కూడా చేస్తామన్నారు.