న్యాయ వ్యవస్థపై అత్యంత గౌరవం ఉంది : సీఎం రేవంత్ రెడ్డి

న్యాయ వ్యవస్థపై అత్యంత గౌరవం ఉంది : సీఎం రేవంత్ రెడ్డి

భారత న్యాయ వ్యవస్థపై అత్యంత గౌరవం, విశ్వాసం, నమ్మకం ఉన్నాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అదే విధంగా న్యాయ ప్రక్రియపైనా గట్టి నమ్మకం ఉందని స్పష్టం చేశారాయన. కవిత బెయిల్ విషయంలో.. సుప్రీంకోర్టు తీర్పును ప్రశ్నించినట్లు పత్రికల్లో వచ్చిన కథనాలపై స్పందించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ మేరకు ఎక్స్ లో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారాయన.

ఎమ్మెల్సీ కవితకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసిన క్రమంలో సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై గందరగోళం నెలకొన్న నేపథ్యంలో ఎక్స్ ద్వారా స్పందించారు సీఎం రేవంత్. న్యాయ వ్యవస్థపై తనకు గట్టి నమ్మకం ఉందని, పత్రికల్లో తన వ్యాఖ్యలను వక్రీకరించారని, దీని పట్ల బేషరతుగా విచారం వ్యక్తం చేస్తున్నానని అన్నారు.న్యాయవ్యవస్థ, దాని స్వతంత్రత పట్ల తనకు అత్యున్నత గౌరవం ఉందని అన్నారు. భారత రాజ్యాంగ నీతిపై దృఢంగా విశ్వసం ఉన్న వ్యక్తిగా, న్యాయవ్యవస్థ పట్ల తనకున్న గౌరవం ఎప్పటికీ కొనసాగుతుందని అన్నారు.

Also Read:-హైదరాబాద్‎లో కొనసాగుతోన్న కూల్చివేతల పరంపర