ఎర్రబెల్లి నమ్మక ద్రోహి.. కేసీఆర్ను కూడా మోసం చేస్తడు: రేవంత్

ఎర్రబెల్లి నమ్మక ద్రోహి.. కేసీఆర్ను కూడా మోసం చేస్తడు: రేవంత్

మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. ఎర్రబెల్లి పలక పట్టుకుని అన్ని ఓనమాలు సొంతంగా రాసినా.. ఏబీసీడీలు అన్ని రాసినా తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు. పాలకుర్తి  మీటింగ్ లో  మాట్లాడిన రేవంత్ రెడ్డి...  చారిత్రక పాలకుర్తి గడ్డని.. ఓనమాలు రాని ఎర్రబెల్లి  ఏలుతున్నాడని విమర్శించారు. 

ఎర్రబెల్లి పచ్చిమోసగాడని..నమ్మక ద్రోహి అని  రేవంత్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు నాయుడు ఎర్రబెల్లిని నమ్మి అసెంబ్లీ ప్లోర్ లీడర్ ను చేస్తే  మోసం చేశాడని ఆరోపించారు. పేదలకు అండగా ఉన్న టీడీపీని  ఈ గడ్డపై లేకుండా చేసిన చరిత్ర ఎర్రబెల్లిదేనని వ్యాఖ్యానించారు.  టీడీపీలో ఉండి బీఆర్ఎస్ కు కోవర్టుగా పనిచేశారని ధ్వజమెత్తారు.  భవిష్యత్తు ఇచ్చిన టీడీపీని  పాలకుర్తిలో లేకుండా చేశారన్నారు. ఎర్రబెల్లి  ఏదో ఒక రోజు కేసీఆర్ ను కూడా  మోసం చేస్తాడని రేవంత్  అన్నారు.  కేసీఆర్ నిద్రపోతే ఆయనకు తెలియకుండానే  కిడ్నీలు అమ్ముకునే తత్వం దయాకర్ రావుదని విమర్శించారు.