గెలిచినా.. ఓడినా ప్రజల్లో ఉంటాం: రేవంత్ రెడ్డి

గెలిచినా.. ఓడినా ప్రజల్లో ఉంటామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు.2023, నవంబర్ 11వ తేదీ శనివారం రామగుండంలో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి సభలో రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు.   ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ అక్రమంగా గెలిచారని. ప్రజలు ఓడించానా.. ఈవీఎంలు మార్చి కొప్పుల ఎమ్మెల్యే అయ్యారు. మంత్రి అయినా కూడా కొప్పుల ఈశ్వర్ ధర్మపురిని అభివృద్ధి చేయలేదు.అడ్లూరి లక్ష్మణ్ ను ఓడించేందుకు కుట్ర చేశారు. కాంగ్రెస్ అంటేనే.. సంక్షేమ పథకాలు.

రాష్ట్రంలో రైతులకు రూ.2లక్షల రుణమాఫీ కావాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి. రాష్ట్రంలో ఉన్న రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను సంవత్సరం తిరిగే లోపు భర్తి చేయాలంటే కాంగ్రెస్ గెలవాలి. పేదలు ఇళ్లు కట్టుకోవడానికి రూ5.లక్షలు కావాలన్నా కాంగ్రెస్ ప్రభుత్వ రావాలి. రేషన్ షాపులో కాంగ్రెస్.. తొమ్మిది వస్తువులతో కలిపి బియ్య పంపిణీ చేస్తే.. కేసీఆర్ వచ్చి అవేవి ఇవ్వకుండా దొడ్డు బియ్యం మాత్రమే ఇస్తున్నారు. రేషన్ షాపుల్లో సన్నబియ్యం ఇవ్వాలలన్నా.. రూ.500లకే ఇంటి సిలిండర్ కావాలన్నా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి

 ప్రాజెక్టుల రీ డిజైన్ల పేరుతో రూ.లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే ఈ ప్రాంతం బాగుపడింది. కేసీఆర్ అవినీతికి మేడిగడ్డ బలైంది. మింగిన రూ.లక్ష కోట్లను కక్కించే బాధ్యత మాది. రూ.లక్ష కోట్లు పెట్టి.. ఇసుకపై ప్రాజెక్టు కట్టారు. పక్కనే గోదావరి నది పోతున్నా.. మనకు సాగు నీరు లేదు." అని మండిపడ్డారు.