మైనార్టీ డిక్లరేషన్ ప్రకటించిన కాంగ్రెస్

కాంగ్రెస్ పార్టీ ముస్లీం డిక్లరేషన్ ను ప్రకటించింది. 2023, నవంబర్ 9వ తేదీ గురువారం సాయంత్రం హైదరాబాద్ నగరంలోని సిటీ కన్వెన్షన్ లో నిర్వహించిన మైనార్టీ డిక్లరేషన్ కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి  పాల్గొని డిక్లరేషన్ ను ప్రకటించారు. 

ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. "ఆక్రమణలకు గురైన వక్ఫ్ భూములను స్వాధీనం చేసుకుంటాం.ఆక్రమణలకు గురికాకుండా వక్ఫ్ భూములను డిజిటలైజేషన్ చేస్తాం. మైనార్టీలకు ప్రత్యేక సబ్ ప్లాన్ ఏర్పాటు చేస్తాం. ఇంటి జాగతోపాటు నిర్మాణానికి రూ.5లక్షల నగదు సాయం చేస్తాం. ఉర్దూ మీడియం టీచర్ల కోసం ప్రత్యేక డిఎస్సీ నిర్వహిస్తాం. మైనార్టీల కోసం ఏడాదికి రూ.4వేల కోట్ల బడ్జెట్ కేటాయించడంతోపాటు రూ.వెయ్యి కోట్ల రుణాలు ఇస్తాం. ఎంపిహెచ్ఎల్ పూర్తి చేసిన మైనార్టీలకు రూ.5లక్షల అర్థిక సాయం చేస్తాం. ముస్లీం, క్రిస్టియన్ స్మశాన వాటికల కోసం భూమి కేటాయిస్తాం. కొత్తగా పెళ్లైన జంటలకు రూ.లక్ష 60వేల ఆర్థిక సాయం చేస్తాం" అని  హామీ ఇచ్చారు.