
తెలంగాణకు అసలు తల్లి సోనియా గాంధీనే అన్నారు కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి. ఇంద్రవెల్లిలో కాంగ్రెస్ దళిత,గిరజన దండోరా సభలో మాట్లాడిన రేవంత్.. సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రానికి దళితుడు ముఖ్యమంత్రి కాలేదని..దరిద్రుడుయిండన్నారు. ఇప్పటి నుంచి ఒక లెక్క.. ఇక నుంచి ఒక లెక్కన్నారు. ప్రగతి భవన్ ను బద్దలు కొట్టి కేసీఆర్ ను చర్లపల్లిజైలుకు పంపుతామన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండేది ఇంకా 22 నెలలేనన్నారు. స్వేఛ్చ కోసం పోరాడి ప్రాణాలిచ్చిన గడ్డ ఇంద్రవెల్లి అన్నారు. రూ.4లక్షల కోట్లు అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారన్నారు.రాష్ట్రంలో ప్రతి ఒక్కరి మీద లక్ష రూపాయల అప్పు చేసి పెట్టారన్నారు. కేసీఆర్ ప్రజలకు ఒక్కరూపాయి ఇవ్వలే కానీ..బిడ్డనుబిర్లా..అల్లుడిని అంబానీ, కొడుకును టాటాను చేసి..ఫాంహౌస్ లో మందు తాగి పడుకున్నాడన్నారు. ఎస్సీని ముఖ్యమంత్రి చేస్తానన్న కేసీఆర్..పంచెకట్టుకుంటున్నాడని దళితుడిని మంత్రిపదవి నుంచి తొలగించారన్నారు. కేసీఆర్ మంత్రివర్గంలో ఎస్సీలకు చోటు దక్కలేదన్నారు.దళితబంధును 119 నియోజకవర్గాల్లో అమలు చేయాలన్నారు.
ఇంద్రకరణ్, జోగురామన్న, బాల్క సుమన్ ల బానిసత్వం ఆదిలాబాద్ జిల్లాకి అరిష్టంగా మారిందన్నారు. దళిత నేతలకు కాంగ్రెస్ పార్టీ ఎంతో పెద్దపీఠ వేసిందన్నారు. అడవిలో జంతువుల కంటే ఘోరంగా కేసీఆర్ పాలనలో ఆదివాసీల బ్రతుకుతున్నారన్నారు. కేసీఆర్ లాంటి బద్మాష్ మాటలు చరిత్రలో ఏ ముఖ్యమంత్రి మాట్లాడలేదన్నారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఉపఎన్నికలు రావాలని అప్పుడే అభివృద్ధి జరుగుతుందన్నారు. పేదలకు చిల్లి గవ్వ ఇవ్వకున్నా.. రాష్ట్రంలో ప్రతి ఒక్కరిపై లక్ష రూపాయల అప్పు భారం మోపారన్నారు. ఆదిలాబాద్ లో 90 గ్రామాలకు ఇప్పటి వరకు రక్షితమంచి నీరు అందడంలేదన్నారు. కొంతమంది పోలీసులు కేసీఆర్ కి కట్టు బనిసలుగా మారారన్నారు. కార్యకర్తలను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటానన్నారు. రాజకీయాల్లో ఇంకా 20ఏళ్ళు ఉంటానని.. చివరి రక్తపు బొట్టు వరకు కార్యకర్త కోసం బ్రతుకుతానన్నారు.