నేటి(జనవరి 16) నుంచి సీఎం రేవంత్‌‌‌‌ రెడ్డి దావోస్‌‌‌‌ పర్యటన

హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్‌‌‌‌ రెడ్డి వారం రోజుల పాటు సింగపూర్, దావోస్‌‌‌‌లో పర్యటించనున్నారు. గురువారం రాత్రి ఢిల్లీ నుంచి సింగపూర్‌‌‌‌‌‌‌‌కు సీఎం రేవంత్ రెడ్డి బృందం వెళ్తున్నది. 17 నుంచి 19 వరకు అక్కడే పర్యటిస్తారు . స్కిల్ యూనివర్సిటీతో పాటు ఇతర పెట్టుబడుల ఒప్పందాలపై అక్కడ చర్చలు జరుపుతారు. ఆ తర్వాత జనవరి 20 నుంచి 23 వరకు దావోస్‌‌‌‌లో పర్యటిస్తారు. స్విట్జర్లాండ్‌‌‌‌లోని దావోస్‌‌‌‌లో జ‌‌‌‌రిగే ప్రపంచ పెట్టుబ‌‌‌‌డుల స‌‌‌‌ద‌‌‌‌స్సుకు సీఎం రేవంత్ రెడ్డి హాజ‌‌‌‌ర‌‌‌‌వుతారు.

వ‌‌‌‌ర‌‌‌‌ల్డ్ ఎక‌‌‌‌న‌‌‌‌మిక్ ఫోరం స‌‌‌‌ద‌‌‌‌స్సులో తెలంగాణలో పెట్టుబ‌‌‌‌డుల‌‌‌‌కు ఉన్న అవ‌‌‌‌కాశాల‌‌‌‌పై ఆ సదస్సులో వివ‌‌‌‌రించ‌‌‌‌నున్నారు. ప్రపంచ‌‌‌‌వ్యాప్తంగా ఉన్న పారిశ్రామికవేత్తలకు రాష్ట్రంలో పెట్టుబడుల ప్రాధాన్యతపై వివరిస్తారు. సీఎం రేవంత్ వెంట మంత్రి శ్రీధర్ బాబు, పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు వెళ్లనున్నారు. తిరిగి జనవరి 24న సీఎం రేవంత్ బృందం రాష్ట్రానికి చేరుకుంటారు. గతేడాది దావోస్‌‌‌‌ సదస్సులో కుదిరిన ఒప్పందాలతో రూ.40 వేల 232 కోట్ల పెట్టుబడులు తెలంగాణకు వచ్చాయి. 18 ప్రాజెక్టులకు ఒప్పందాలు చేసుకుంటే.. ఇప్పటికే 17 ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి.