ఖమ్మం వేదికగా కాంగ్రెస్ ఎన్నికల శంఖారావం పూరిస్తుంది: రేవంత్ రెడ్డి

ఖమ్మంలో తెలంగాణ జనగర్జన సభకు సంబంధించి సమీక్షించేందుకు ఇక్కడకు వచ్చామన్నారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. జూన్ 30వ తేదీ శుక్రవారం ఖమ్మం జిల్లాలో తెలంగాణ జన గర్జన సభ స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేతలు భట్టి విక్రమార్క, మధుయాష్కీ పలువురితో భేటీ అయ్యారు రేవంత్. ఈ భేటీ ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడారాయన. సభా ఏర్పాట్లకు సంబంధించి భట్టి సూచనలు, సలహాలు తీసుకుంటామన్నారు. జూలై 2న ఖమ్మంలో జరిగే తెలంగాణ గర్జన సభకు రాహుల్ గాంధీ హాజరవుతారని తెలిపారు.

ఖమ్మం వేదికగా కాంగ్రెస్ ఎన్నికల శంఖారవాన్ని పూరిస్తుందని వ్యాఖ్యానించారు రేవంత్ రెడ్డి. ప్రభుత్వం ఎన్ని అడ్డుగోడలు పెట్టినా కాంగ్రెస్ కార్యకర్తలు పడగొట్టి తొక్కుకుంటూ సభకు హాజరవుతారని అన్నారు. తెలంగాణ జన గర్జన సభకు ఖమ్మం జిల్లా ప్రజల నుంచి వచ్చే స్పందన మీరే చూస్తారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.