జనం గుండె చప్పుడు ఏంటో విన్నా : ప్రజాదర్బార్ పై సీఎం ఎమోషనల్

జనం గుండె చప్పుడు ఏంటో విన్నా : ప్రజాదర్బార్ పై సీఎం ఎమోషనల్

తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఏర్పాడిన కొత్త ప్రభుత్వం ప్రజల సమస్యలపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా డిసెంబర్ 8వ తేదీ శుక్రవారం జ్యోతిబాపూలే ప్రజాభవన్ లో సీఎం రేవంత్ రెడ్డి ప్రజాదర్బార్ నిర్వహించారు. దీంతో తమ కష్టాలు సీఎంతో చెప్పుకునేందుకు భారీ ఎత్తున ప్రజలు జ్యోతిబాపూలే ప్రజాభవన్ వద్దకు తరలివచ్చారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను కలిసి వారి కష్టాలను విన్నారు. అనంతరం  ప్రజల వద్ద నుంచి ఆర్జీలను స్వీకరించి.. వారి సమస్యలను పరిష్కరించాలను సంబంధిత అధికారులను ఆదేశించారు. 

అనంతరం ఆయన సచివాలయానికి బయల్దేరి వెళ్ళారు. ఈరోజు జ్యోతిబాపూలే ప్రజాభవన్ లో జరిగిన ప్రజాదర్బార్ గురించి సోషల్ మీడియాలో పంచుకున్నారు. "జనం కష్టాలు వింటూ…  కన్నీళ్లు తుడుస్తూ తొలి ప్రజా దర్బార్ సాగింది.  జనం నుండి ఎదిగి…ఆ జనం గుండె చప్పుడు విని… వాళ్ల సేవకుడిగా సాయం చేసే అవకాశం రావడానికి మించి తృప్తి ఏముంటుంది!" అని ఎక్స్ లో తన అభిప్రాయం వెల్లడిస్తూ.. ఎమోషనల్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి.