కాంగ్రెస్ సభ సక్సెస్ .. కాంగ్రెస్ నినాదాలతో దద్దరిల్లిన బెల్లంపల్లి 

బెల్లంపల్లి, వెలుగు : బెల్లంపల్లి పట్టణంలో శనివారం జరిగిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విజయ భేరి సభ విజయవంతమయ్యింది. చెన్నూర్ అభ్యర్థి, మాజీ ఎంపీ గడ్డం వివేక్ వెంకటస్వామి అధ్యక్షత జరిగిన ఈ సభకు ఏఐసీసీ సెక్రెటరీ గొమాస శ్రీనివాస్, పార్టీ పరిశీలకుడు మోహన్ జోషి, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్లు టి.నాగయ్య, కేవీ ప్రతాప్, ఏఐటీయూసీ జనరల్ సెక్రెటరీ వాసిరెడ్డి సీతారామయ్య హాజరయ్యారు. స్థానిక నాయకుల ఐక్యత బలాన్ని ఈ సభ చాటిచెప్పింది.

అసమ్మతి నేతలంతా ఐక్యం కావడం కాంగ్రెస్​శ్రేణుల్లో జోష్​నింపింది. ఇటీవల ఇదే క్రీడా మైదానంలోజరిగిన సీ ఎం కేసీఆర్ సభను తల దాన్నెలా జనం ఈ సభకు తరలివచ్చారు. నియోజకవర్గంలోని కన్నెపల్లి, బెల్లంపల్లి, నెన్నెల, కాసిపేట, తాండూర్, వేమనపల్లి, భీమినిలోని మారుమూల గ్రామాలతోపాటు పట్టణంలోని అన్ని కాలనీల నుంచి ప్రజలు తరలిరావడంతో సభ కిక్కిరిసింది. కాంగ్రెస్ పార్టీపై అబద్ధాలు చెబుతున్న ముఖ్యమంత్రి పీడను వదిలించుకోవాలని రేవంత్ చేసిన ప్రసంగంపై సబికులు కేరింతలు కొట్టారు. అడుగడుగునా రేవంత్ రెడ్డి ప్రసంగానికి ప్రజలు నీరాజనం పలికారు.

కాంగ్రెస్​లోకి భారీగా చేరికలు

రేవంత్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్, సీపీఐ, బీజేపీ, ఎంఐఎం పార్టీలకు చెందిన మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ లో చేరారు. వివేక్ వెంకటస్వామి, గడ్డం వినోద్, మున్సిపల్ మాజీ  చైర్మన్ మత్తమారి సూరిబాబు, కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ ముచ్చర్ల మల్లయ్య ఆధ్వర్యంలో సీపీఐ టౌన్ మాజీ సెక్రెటరీ మంతెన మల్లేశ్​తో పాటు బీఆర్ఎస్ పార్టీ మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు, ఠాకూర్  గాయత్రీదేవి, పొట్ల సురేశ్, సల్లా సంజీవరెడ్డి, డోకూరు పూలమ్మ, సిరికొండ రేణుక, అందె వరలక్ష్మి, గొమాస ప్రశాంత్, గాజుల కృష్ణ మోహన్, దూడపాక రాజేశ్వర్ కాంగ్రెస్​లో చేరారు. మున్సిపల్ మాజీ కోఆప్షన్ సభ్యుడు ఎండీ నిజాముద్దీన్, ఎండీ మహబూబీ, నాయకులు పిల్లి ఆనంద్, మత్తమారి రాయమల్లు, మేడి పున్నం చందర్,ఎండీ సాదిక్ తదితరులు కాంగ్రెస్​గూటికి చేరారు.