
అష్టాదశ శక్తిపీఠాల్లో ఒక్కటైన ఆలంపూర్ జోగులాంబ అమ్మవారిని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయంలో రేవంత్ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అలంపూర్ బహిరంగ సభలో రేవంత్ పాల్గొంటారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 2 గంటలకు గద్వాల బహిరంగసభలో రేవంత్ ప్రసంగిస్తారు. సాయంత్రం 4 గంటలకు మక్తల్ లో నిర్వహించనున్న సభలో రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు.