అలంపూర్,వెలుగు: దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను మంగళవారం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, అలంపూర్ ఎమ్మెల్యే అభ్యర్థి సంపత్ కుమార్ తో కలిసి దర్శించుకున్నారు. వీరికి ఆలయ ఈవో పురేందర్ కుమార్, ఆలయ చైర్మన్ చిన్న కృష్ణయ్య, అర్చకులు ఆనంద్ శర్మ స్వాగతం పలికారు. ముందుగా గణపతి పూజ నిర్వహించారు. బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం జోగులాంబ అమ్మవారి ఆలయంలో కుంకుమార్చన పూజలు నిర్వహించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలోని ఆరు గ్యారంటీలకు సంబంధించిన పత్రాలను స్వామివారి, అమ్మవారి ఆలయంలో ఉంచి పూజలు నిర్వహించారు. అనంతరం షాలీ పైల్వాన్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. స్థానిక నాయకులు రేవంత్ ను సత్కరించారు.