ప్రతి పక్షాలు ఏదో ఒకటి మాట్లాడాలని మాట్లాడుతున్నాయని.. వాటిల్లో వాస్తవాలు లేవని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. టీ కప్పులో తుఫాన్ లాంటివి ప్రతి పక్షాల మాటలని మంత్రి చిట్ చాల్లో అన్నారు. సీఎం మార్పుపై బీఆర్ఎస్, బీజేపీ నాయకుల మాటలను ఆయన ఖండించారు. రాబోయే ఇదేండ్లు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డినే ఉంటారని మంత్రి వివరించారు. రాష్ట్రంలో ప్రముఖ నాయకులు అవినీతి కేసుల్లో అరెస్ట్ అవుతారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. తాను అన్న బాంబు ఒకటిరెండు రోజులు ఆటో.. ఇటో ఉంటుందని మంత్రి చిట్ చాట్లో స్పష్టం చేశారు.