రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రూ.500లకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా భద్రాచాలంలో రేవంత్ రెడ్డి పాదయాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా మహిళా కూలీలతో కలిసి రేవంత్ నాటేశారు. ఆ కూలీలు వారి సమస్యలను రేవంత్ తో చెప్పుకున్నారు. ఈ సందర్భంగా వారిని ఓదార్చిన రేవంత్.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పేదలు ఇళ్లు కట్టుకుంటే రూ.5 లక్షలు ఇస్తామని చెప్పారు. 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు.
కూలీలతో కలిసి నాటేసిన వీడియోను రేవంత్ తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. మట్టిలో కాలుమోపగానే తన మూలాలు గుర్తొచ్చాయని..ఢిల్లీకి రాజైనా తల్లికి బిడ్డే కదా? అని ట్వీట్ చేశారు. తాను ఈ మట్టి మనుషుల బిడ్డనేనని ..ఈ మట్టి వాసనల మధ్య పెరిగిన తెలంగాణ బిడ్డనేనన్నారు. తాను నికార్సైన రైతు బిడ్డనని... రైతు కష్టం తెలిసినోడినని రేవంత్ తెలిపారు.