- చెరుకు సుధాకర్, కోమటిరెడ్డిల గొడవపై ఉత్తమ్ స్పందించాలని డిమాండ్
- ఉమ్మడి నల్గొండ జిల్లాలోకి రాకుండా రేవంత్ ను అడ్డుకున్నారని ఆరోపణలు
నల్గొండ, వెలుగు: ఉమ్మడి నల్గొండ జిల్లాలోని కాంగ్రెస్ అగ్ర నేతలను ఇరకాటంలో పెట్టేందుకు రేవంత్ వర్గం స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. రాష్ట్ర ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్‌ను అడ్డం పెట్టుకుని హైడ్రామా నడిపిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సుధాకర్‌పై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై పోలీస్ కేసు పెట్టించడం పార్టీ పెద్దల రాజకీయ వ్యూహాంలో భాగమేనని చెప్పుకుంటున్నారు. వెంకటరెడ్డి, సుధాకర్ వ్యవహారాన్ని జిల్లా పార్టీ నేతలు మొదట వారిద్దరి వ్యక్తిగత సమస్యగా భావించారు. ఎవరూ తలదూర్చకుండా సైలెంట్‌గా ఉన్నారు. అయితే ఎంపీ వెంకటరెడ్డిపైన పోలీసు కేసు నమోదైన రెండ్రోజులకే స్టేట్కాంగ్రెస్చీఫ్రేవంత్ రెడ్డి వర్గం ఎంపీ ఉత్తమ్ కుమార్‌రెడ్డిని టార్గెట్ చేయడంతో వివాదం కొత్త మలుపు తీసుకుంది. ఉత్తమ్, వెంటరెడ్డిని వ్యూహాత్మకంగా టార్గెట్ చేస్తున్నట్లు కనిపిస్తోంది.
జోడో యాత్ర అడ్డుకోవడంతో మొదలు
రేవంత్ రెడ్డి ‘హాత్‌సే హాత్‌జోడో యాత్ర’ను ఉమ్మడి జిల్లాలోకి రానివ్వకుండా ఎంపీలు ఉత్తమ్, కోమటిరెడ్డి అడ్డుకున్నారని రేవంత్ వర్గం మొదటి నుంచి ఆరోపిస్తోంది. వారిద్దరికి రేవంత్యాత్ర జిల్లాలో కొనసాగడం ఇష్టంలేకపోవడంతోనే దారి మళ్లించారని చెబుతోంది. యాత్రలో భాగంగా రేవంత్నల్గొండకు వస్తే జిల్లా కేంద్రంలో పార్టీ ఆఫీస్ఓపెనింగ్ చేయించాలని ఆయన వర్గం భావించింది. అలాగే నియోజకవర్గాల్లో బలప్రదర్శన చేయాలని పెద్ద ప్లాన్‌వేసింది. చివరికి యాత్ర క్యాన్సిల్కావడంతో నిరాశకు గురైన రేవంత్వర్గీయులు ఉత్తమ్, వెంకటరెడ్డిపై మండిపడుతున్నారు. పైగా తన భువనగిరి ఎంపీ సెగ్మెంట్ పరిధిలో వెంకటరెడ్డి ఇప్పటివరకు జోడో యాత్ర మీటింగ్ పెట్టలేదు. దీన్ని జీర్ణించుకోలేకపోతున్న రేవంత్‌వర్గం చెరుకు సుధాకర్ గొడవను తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తోంది. గొడవ జరిగి వారం రోజులు కావస్తుండగా, మొదటిరోజునే వెంకటరెడ్డి, సుధాకర్ఇటు స్టేట్పీసీసీకి, అటు ఢిల్లీ పెద్దలకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఆ తర్వాత రోజు వెంకటరెడ్డి స్పందిస్తూ సుధాకర్ పైన భావోద్వేగంతోనే తప్ప, కావాలని తిట్టలేదని వివరణ ఇచ్చుకున్నారు. అంతటితో గొడవ సద్దుమణిగిందని అనుకుంటున్న టైంలో ఊహించని రీతిలో వెంకటరెడ్డిపైన పోలీసు కేసు నమోదైంది.
కోమటిరెడ్డి, ఉత్తమ్ ఒక్కటే అనేలా..
ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ లో ఆధిపత్య పోరు నడుస్తోంది. జానారెడ్డి, రేవంత్ రెడ్డి వర్గం ఓ వైపు, ఉత్తమ్ కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వర్గం మరోవైపు అన్నట్టుగా సాగుతోంది. నల్గొండలో జరగాల్సిన రేవంత్ మీటింగ్‌ను వెంకటరెడ్డి అడ్డుకోవడంతోనే జానారెడ్డి సొంత నియోజకవర్గమైన నాగార్జునసాగర్ లో పెట్టుకోవాల్సి వచ్చిందని రేవంత్‌వర్గం ఆరోపిస్తోంది. ఉత్తమ్ పార్టీలో కోవర్టని, వెంకటరెడ్డిని హోంగార్డుతో పోల్చడంతో విభేదాలు మరింత ముదిరాయి. అయితే రేవంత్ పీసీసీ ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి రాష్ట్ర కాంగ్రెస్‌లో వర్గపోరు ఎక్కువైందని, మరీ ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యవహారాల్లో తలదూర్చి, పార్టీలో లేనిపోని గొడవలు సృష్టిస్తున్నారని ఉత్తమ్, వెంకటరెడ్డి వర్గం బలంగా ఆరోపిస్తోంది. తాజాగా వెంకటరెడ్డి, సుధాకర్ మధ్య జరిగిన గొడవలోకి ఉత్తమ్‌ను లాగాలని రేవంత్ వర్గం ప్రయత్నించడం వర్గ పోరును బట్టబయలు చేస్తోంది. ఈ గొడవపై ఉత్తమ్‌తోపాటు, జిల్లా అగ్రనేతలు జానారెడ్డి, దామోదర్‌రెడ్డి సహా ఎవరూ నోరుమెదపలేదు. జానా, రేవంత్ వర్గీయులు ఒక్కటై ఉత్తమ్ స్పందించాలని డిమాండ్ చేయడాన్ని రాజకీయ కోణంలో చూడాల్సి వస్తోందని ఆ పార్టీ సీనియర్ నేత ఒకరు అన్నారు. సుధాకర్ గొడవను అడ్డంపెట్టుకుని పార్టీలో చిచ్చు పెట్టాలని చూస్తున్నారని, ఎన్నికల టైంలో ఇలాంటి గొడవలు పార్టీకే నష్టం కలిగిస్తాయని తెలిపారు.
ఇంతటితో వదలం అంటూ..
కేసు నమోదు వెనుక స్టేట్ హైకమాండ్ ఉన్నట్లు జిల్లా పార్టీలో చర్చ నడుస్తోంది. కేసు నమోదైన నాలుగు రోజులకు మళ్లీ రేవంత్ వర్గం ఉత్తమ్‌ను టార్గెట్ చేసింది. తాజాగా వెంకటరెడ్డి వైఖరిపై ఉత్తమ్ స్పందించాలని నల్గొండలో చెరుకు సుధాకర్, కొండేటి మల్లయ్య మరికొందరు పార్టీ నాయకులు ప్రెస్‌మీట్‌పెట్టి డిమాండ్ చేశారు. దీనికి కుల సంఘాల సపోర్ట్ కూడా ఉందని, దీన్ని ఇంతటితో వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. దీన్ని బట్టి చూస్తే సుధాకర్ వివాదాన్ని అడ్డంపెట్టుకుని రేవంత్ వర్గం ఇద్దరు ఎంపీలపైన తిరుగుబాటు చేయాలనే అభిప్రాయానికి వచ్చినట్లు కనిపిస్తోంది.