హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా జగిత్యాల జిల్లాలో పాదయాత్ర చేస్తోన్న పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి ఓ వింత అనుభవం ఎదురైంది. కథలాపూర్ మండలం కలికోట సూరమ్మ చెరువు సందర్శన చేస్తుండగా... ఓ రైతు చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. రేవంత్ రెడ్డిని ఇంకా తెలుగు దేశం లీడరే అనుకుని ఆ రైతు.. ఆయన ముందు టీడీపీపై అభిమానాన్ని చాటుకున్నారు.
సూరమ్మ చెరువు ప్రాజెక్టు కట్టకుండా కేసీఆర్ ప్రభుత్వం మోసం చేసిందని చెప్పే క్రమంలో తాను ఒరిజనల్ టీడీపీ కార్యకర్తనని, తన తండ్రి కూడా టీడీపీ నాయకుడని" చెప్పుకుంటూ ఆ రైతు అక్కడ్నుంచి వెళ్లిపోయారు. దీన్నంతా గమనిస్తోన్న కాంగ్రెస్ నేతలు.. రైతు మాటలను మధ్యలోనే ఆపేసి.. టాపిక్ ను డైవర్ట్ చేసే ప్రయత్నం చేశారు.