![హస్తం సునామీ దెబ్బకు కారు గ్యారేజ్కి వెళ్ళబోతుంది: రేవంత్ రెడ్డి](https://static.v6velugu.com/uploads/2023/11/revanthreddy-about-telangana--elections-202_zMyFJR1cZt.jpg)
తెలంగాణ ఎన్నికల్లో విజయావకాశాలపై బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రంలోని అన్ని రిపోర్టుల ప్రకారం కారు టాప్ గేరులో దూసుకెళ్తుందని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేస్తే.. హస్తం సునామీ దెబ్బకు కారు గ్యారేజ్ కి వెళ్లబోతుంది... ఇది తెలంగాణ ప్రజల చైతన్యానికి ప్రతీక అంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.
మరో వైపు తెలంగాణ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది.రాష్ట్రవ్యాప్తంగా 35 వేల 655 పోలింగ్ కేంద్రాల్లో ఓట్లు వేస్తున్నారు ప్రజలు. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు క్యూ కడుతున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఓవరాల్ గా 36.68 శాతం పోలింగ్ నమోదు
హస్తం సునామీ దెబ్బకు కారు గ్యారేజ్ కి వెళ్లబోతోంది.
— Revanth Reddy (@revanth_anumula) November 30, 2023
ఇది తెలంగాణ ప్రజల ఛైతన్యం కు ప్రతీక.
CAR is going to the garage due to the tsunami of Congress.
It symbolizes the spirit of Telangana people.
#TelanganaAssemblyElection2023