లోక్ సభ ఎన్నికల్లో తీర్పు మారుతుంది : రేవంత్ రెడ్డి

లోక్ సభ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు విలక్షణమైన తీర్పు ఇస్తారని చెప్పారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్ గిరి ఎంపీ అభ్యర్థి రేవంత్ రెడ్డి. ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడానికి ముందు జూబ్లీహిల్స్ వెంకటేశ్వర ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. రాహుల్ గాంధీ ఆదేశంతోనే మల్కాజ్ గిరి నుంచి పోటీచేస్తున్నానని చెప్పారు. కేంద్రంలో సుస్థిరమైన, బలమైన ప్రభుత్వం ఏర్పాడాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు రేవంత్ రెడ్డి.