నిజామాబాద్, వెలుగు: సీఎం రేవంత్‌రెడ్డి ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ చేయకుండా గవర్నమెంట్చిహ్నాలు, గుర్తులు మార్చాలనుకోవడం తుగ్లక్ పాలనను గుర్తు చేస్తోందని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఫైరయ్యారు. శుక్రవారం మీడియాకు ఆయన ఓ వీడియో విడుదల చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని పక్కదారి పట్టించి ప్రజల దృష్టి మళ్లించడానికే ఇదంతా చేస్తున్నారన్నారు. నిజామాబాద్ జిల్లా పేరును ఇందూర్‌గా మార్చాలని ప్రజలు ఎప్పటి నుంచి కొరుకుంటున్నారని, ఆదిలాబాద్‌ను ఎదులాపురంగా, వరంగల్‌ను ఓరుగల్లుగా, మహబూబాబాద్ ను మానుకోటగా, హైదరాబాద్ ను భాగ్యనగర్ గా మార్చాలనే డిమాండ్‌ను పట్టించుకోవడం లేదన్నారు. రైతు రాజ్యం అని గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ నాయకులు నిన్న రైతులపై అమానుషంగా పోలీసు లాఠీ చార్జ్ చేయించిందని
మండిపడ్డారు.