సీడీపీవోగా రేవతి బాధ్యతల స్వీకరణ

పాల్వంచ రూరల్, వెలుగు : పాల్వంచ రూరల్​ ప్రాజెక్ట్​ పరిధిలో సీడీపీవోగా రేవతి గురువారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ సీడీపీవోగా పని చేసిన కనకదుర్గ బదిలీపై ఖమ్మం జిల్లా వెళ్లారు. దీంతో బూర్గంపాడు ఐసీడీఎస్​  ప్రాజెక్ట్​లో పనిచేస్తున్న రేవతిని పాల్వంచ రూరల్​ ప్రాజెక్ట్​ సీడీపీవోగా నియమించడంతో ఆమె బాధ్యతలు స్వీకరించారు.

ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ తమ పరిధిలోని అంగన్​వాడీ కేంద్రాలను సమర్ధవంతంగా నిర్వహించేందుకు కృషి చేస్తామన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించేవారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.