![హైదరాబాద్‌లో రివీల్ ఆఫీస్](https://static.v6velugu.com/uploads/2024/01/reveal-office-in-hyderabad_iFjKRIgxf0.jpg)
హైదరాబాద్, వెలుగు : ఆసియా–-పసిఫిక్ ప్రాంతంలో ఉనికిని విస్తరించడంలో భాగంగా ఏఐ- ఆధారిత ఈడిస్కవరీ, రివ్యూ, రీసెర్చ్, ఇన్వెస్టిగేషన్ ప్లాట్‌ఫారమ్ ‘రివీల్’ హైదరాబాద్‌లో కొత్త ఆఫీసును ప్రారంభించింది. ప్రారంభోత్సవంలో సంస్థ సీఈఓ వెండెల్ జిసా, తెలంగాణ పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, జస్టిస్ పొనుగోటి నవీన్ రావు తదితరులు పాల్గొన్నారు. ఈ ఈవెంట్‌లో రివీల్ ఇండియా డైరెక్టర్ రాజ్ శివరాజు నాయకత్వంలో
‘ఏఐ యుగంలో శక్తి, జవాబుదారీతనం, బాధ్యత’ అనే అంశంపై చర్చ జరిగింది. ఏఐ పౌర సేవలను ఎలా మెరుగుపరుస్తుంది ? ప్రభుత్వ ప్రక్రియలను ఎలా వేగవంతం చేస్తుంది ? అత్యవసర సమస్యలను ఎలా పరిష్కరిస్తుందో వివరించారు. పరిశోధన, డాక్యుమెంట్ అనాలిసిస్, కేస్ ప్రిడిక్షన్‌లోనూ ఏఐను వాడుకోవచ్చని రాజు వివరించారు. కొత్త ఆఫీసు సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, ఏఐ, జనరేటివ్ ఏఐ టీమ్స్‌పై ఫోకస్చేస్తుంది. ఈ ఆఫీసులో 300 మంది పనిచేస్తారు.