విరాజ్ రెడ్డి చీలం హీరోగా నటిస్తున్న చిత్రం ‘గార్డ్’. మిమి లియోనార్డో, శిల్పా బాలకృష్ణన్ హీరోయిన్స్. జగా పెద్ది దర్శకత్వంలో అనసూయ రెడ్డి నిర్మిస్తున్నారు. ‘రివేంజ్ ఫర్ లవ్’ ట్యాగ్‌లైన్‌తో తెరకెక్కుతోంది. శుక్రవారం ఈ మూవీ నుంచి టీజర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో సుశాంత్ పాత్రలో సెక్యూరిటీ గార్డుగా విరాజ్ రెడ్డి కనిపిస్తున్నాడు.
మెల్‌బోర్న్‌లో సెక్యూరిటీగా పనిచేసే ప్లేస్‌లో తనకు ఓ దెయ్యం కనిపిస్తుంది. దాని నుంచి ప్రజలను రక్షించాలనుకుంటాడు. ఈ క్రమంలో విరాజ్ చేసే పనులే ఈ కథగా తెలుస్తోంది. ‘దెయ్యాలు నిజం కాకపోవచ్చు.. కానీ భయం మాత్రం నిజం’ అనే డైలాగ్ ఇంప్రెస్ చేస్తుంది. విరాజ్ యాక్షన్, డైలాగ్ డెలివరీతో పాటు హారర్ ఎలిమెంట్స్ తో కట్ చేసిన టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచింది.
ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకోగా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌లో బిజీగా ఉన్నారు మేకర్స్. త్వరలోనే సినిమా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేయనున్నారు.