కేసీఆర్​ గెలిచినా.. ఓడినా ఫాంహౌస్​ లోనే ఉంటారు: కామారెడ్డి సభలో రేవంత్




తెలంగాణలో శుక్రవారం( నవంబర్​ 30) ఎన్నికలు జరుగనున్నాయి. ఈ రోజు ( నవంబర్​28) సాయంత్రం ప్రచారానికి తెరపడటంతో  తాను పోటీచేస్తున్న నియోజకవర్గం కామారెడ్డిలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​ రెడ్డి రోడ్​ షో నిర్వహించారు.  అనంతరం జరిగిన సభలో  రైతు బంధు విషయంలో కేసీఆర్​ తెలంగాణ ప్రజలను మోసం చేశారన్నారు. మామ ఒక చేత్తో ఇస్తే... అల్లుడు మరో చేత్తో లాక్కొన్నాడన్నారు.  కాంగ్రస్​ అధికారంలోకి వచ్చిన తక్షణమే  6 గ్యారంటీలను అమలు చేస్తామన్నారు.

కామారెడ్డి సభలో రేవంత్​సభ విశేషాలు ఇవే..
 కేసీఆర్​ .. గెలిచినా.. ఓడినా ఫాంహౌస్​ లోనే ఉంటారు
పదేళ్లు తెలంగాణలో అవినీతి రాజ్యం నడిచింది
తెలంగాణ ప్రజల ఆకాంక్షలను కాంగ్రెస్​ పార్టీ నెరవేరుస్తుంది
ప్రతి ఏడాది డిసెంబర్​ లోనే రైతుల ఖాతాలో ఎకరానికి రూ. 15 వేలు జమ...భూమిలేని పేదలకు ఏడాదికి రూ.  12 వేలు
పేదలకు కరెంట్​ ఉచితం... వచ్చే నెల నుంచి కరంట్​ బిల్లు కట్టనవసరం లేదు
కామారెడ్డిలో భూములు కొల్లగొట్టేందుకు కేసీఆర్​ ఇక్కడ పోటీ చేస్తున్నారు
రైతులకు అండగా ఉండాలని సోనియా నన్ను కామారెడ్డిలో పోటీ చేయమన్నారు
ఇందిరమ్మ రాజ్యంవస్తే పేదలు బాగుపడతాయి
వచ్చే నెల నుంచి ఇందిరమ్మ రాజ్యం వస్తుంది
వచ్చేనెల నుంచి గ్యాస్​ సిలెండర్​ ధర రూ. 500
మహిళలు ఉచితంగా బస్సుల్లో ప్రయాణించేందుకు సోనియా అవకాశం కల్పిస్తారు.. వచ్చే నెల నుంచి తెలంగాణ అమలవుతుందని కామారెడ్డి ఎన్నికల ప్రచారంలో రేవంత్​