
తెలంగాణలో పోలింగ్ డేట్ దగ్గరపడింది.. దీంతో రాజకీయ పార్టీలన్నీ ప్రచారంలో స్పీడును మరింత పెంచాయి. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులో జరిగిన ఎన్నికల సభలో టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రసంగించారు. బీఆర్ఎస్ నేతలు ప్రజాధనాన్ని దోచుకున్నారని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలోనే ఉమ్మడి మెదక్ జిల్లా అభివృద్ది జరిగిందన్నారు. పదేళ్లు కేసీఆర్ తెలంగాణను లూటీ చేశారని ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి రావడంతోనే గ్యారంటీలను అమలు చేస్తామన్నారు రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ పాలనలో ఎన్నో దుర్ఘటనలు జరిగాయని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అన్నారు. ఏ ప్రభుత్వ పాలనకైనా ప్రజలే పునాది.. అలాంటిది పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజలు పడిన అవస్థలు తనకు తెలుసన్నారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు రేవంత్ రెడ్డి.