కోకాపేటలో మళ్లీ అక్రమ నిర్మాణాలు కూల్చివేత

కోకాపేటలో మళ్లీ అక్రమ నిర్మాణాలు కూల్చివేత

రంగారెడ్డి జిల్లాలో అక్రమ నిర్మాణలను కూల్చివేశారు రెవెన్యూ అధికారులు.   కోకాపేట్ సర్వే నెంబర్ 100లో అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు అధికారులు. ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి వ్యాపార సముదాయాల నిర్మాణం చేపట్టినట్టు  గుర్తించారు అధికారులు ..  ఏప్రిల్ 8న ఉదయం నుంచే రంగంలోకి దిగి అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు గండిపేట్ రెవెన్యూ అధికారులు. దీంతో  పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేతలు కొనసాగుతున్నాయి. 

గత కొన్ని రోజులుగా గ్రేటర్ హైదరాబాద్ లో ఓ వైపు హైడ్రా,మరో వైపు రెవెన్యూ అధికారులు అక్రమ కట్టడాల పని పడుతున్నారు. అక్రమ కట్టడాలు, కబ్జాలపై  స్థానికుల నుంచి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా పరిశీలించి  కూల్చివేతలు జరుపుతున్నారు.