ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిపై చర్యలు తీసుకున్నారు రెవెన్యూ శాఖ అధికారులు. అక్రమ నిర్మాణాలను జేసీబీ సహాయంతో కూల్చివేశారు. వివరాల్లోకి వెళ్తే రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం పసుమములలో రెవిన్యూ అధికారులు అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. పసుమాముల గ్రామ రెవిన్యూ పరిధిలోని సర్వే నంబర్ 422 ప్రభుత్వ భూమిలో కొందరు వ్యక్తులు 20 గుంటల భూమిని కబ్జా చేసి షెడ్డు వేశారు.
ఈ క్రమంలోనే అక్రమ నిర్మాణాలపై సమాచారం తెలుసుకున్న రెవెన్యూ సిబ్బంది అక్కడికి చేరుకుని పరిశీలించారు. అక్రమంగా నిర్మించినట్టు గుర్తించారు. 20 మే 2024 సోమవారం రోజు తెల్లవారుజామను నుంచి అక్రమ నిర్మాణాలకు కూల్చివేతలు చేపట్టారు అధికారులు. ప్రభుత్వం భూమిని ఎవరైనా కబ్జా చేస్తే చట్టరిత్యమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు రెవెన్యూ శాఖ అధికారులు.