మహబూబ్ నగర్ లో 75 అక్రమ నిర్మాణాలు కూల్చివేత

మహబూబ్ నగర్ లో 75 అక్రమ నిర్మాణాలు కూల్చివేత

హైదరాబాద్ సిటీలోనే కాదు.. ఇప్పుడు అక్రమ నిర్మాణాల కూల్చివేత మహబూబ్ నగర్ జిల్లాకు విస్తరించింది. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని 523 సర్వే నెంబర్ అనేది ప్రభుత్వ భూమి. ఈ ప్రభుత్వ భూమిలో.. పట్టాలు లేకుండా.. అక్రమంగా ఇల్లు నిర్మించుకున్నారు 75 మంది. ఈ నిర్మాణాలను 2024, ఆగస్ట్ 29వ తేదీన ప్రొక్లెయినర్లు, జేసీబీలతో నేలమట్టం చేశారు రెవెన్యూ అధికారులు.  

సర్వే నెంబర్ 523 ప్రభుత్వ భూమి అని తెలిసినా.. కొందరు దళారులు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి.. అమాయకుల నుంచి డబ్బులు వసూలు చేసి పట్టాలు ఇచ్చినట్లు తెలుస్తుంది. పట్టా భూములుగా నకిలీ డాక్యుమెంట్లతో దళారులు వీటిని అమ్మేసినట్లు తెలుస్తుంది. రెవెన్యూ అధికారుల పరిశీలనలో ఇది ప్రభుత్వ భూమి అని నిర్థారణ కావటంతో.. ఆ భూమిలో ఉన్న 75 ఇళ్లను నేలమట్టం చేశారు అధికారు.

Also Read:-పార్టీలకతీతంగా ఎవరు అక్రమాలకు పాల్పడినా చర్యలు

ఇళ్ల కూల్చివేతపై బాధితులు లబోదిబో అంటున్నారు. దళారుల మాటలు నమ్మి మోసపోయాం అంటున్నారు. ఇళ్లు కూల్చివేతతో రోడ్డున పడ్డామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నకిలీ పత్రాలతో స్థలాలు అమ్మిన దళారులపై కేసులు పెట్టి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు బాధితులు.