
బీఆర్ఎస్ భవన్ కు రెవెన్యూ శాఖ నోటీసులు జారీ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా పార్టీ ఆఫీసులో వాణిజ్య కార్యకలాపాలు(టీవీ ఛానల్) జరుగుతున్నాయని తెలిపింది. ఎప్పటిలోగా ఖాళీ చేస్తారో వారంలోపు వివరణ ఇవ్వాలని తెలంగాణ భవన్ ఇన్ ఛార్జ్ శ్రీనివాస్ రెడ్డిని కోరారు.
పార్టీ వ్యవహారాలకు సంబంధించిన ఆఫీసులో 2011 నుంచి టీవీ ఛానల్ వ్యవహారాలను నిర్వహిస్తున్నారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత మరో భవనానికి షిప్ట్ చేసే ప్రయత్నాలు మొదలు పెట్టారు. తాజా నోటీసులతో ఆ ప్రక్రియను వేగవంతం చేసినట్లు తెలిపారు. రెవెన్యూ శాఖ నోటీసులపై తెలంగాణ భవన్ వివరణ ఇవ్వాలని కోరగా స్పందించేందుకు నిరాకరించాయి.