చేర్యాల రెవెన్యూ డివిజన్ ఉద్యమాన్ని ఉధృతం చేయాలి

చేర్యాల, వెలుగు : చేర్యాల రెవెన్యూ డివిజన్ ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి గ్రామ కమిటీలు ఏర్పాటు చేసుకొని  పోరాటాన్ని ఉధృతం చేయాలని రెవెన్యూ డివిజన్ చేర్యాల మండల జేఏసీ చైర్మన్ బొమ్మ గోని అంజయ్య గౌడ్ పిలుపునిచ్చారు.  ఆదివారం చుంచనకోట గ్రామంలో గ్రామ సర్పంచ్ ఆది శ్రీనివాస్ అధ్యక్షతన అఖిలపక్ష మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేర్యాలను రెవెన్యూ డివిజన్ గా ప్రభుత్వం ప్రకటించేంతవరకూ పార్టీలకతీతంగా పోరాటం నిర్వహించాలని కోరారు. అనంతరం గ్రామ అఖిలపక్ష రెవెన్యూ డివిజన్ సాధన జేఏసీ కమిటీని ఎన్నుకున్నారు.

ALSO READ :స్టేషన్​ఘన్​పూర్​లో రోడ్డుపై భోజనాలు చేస్తూ కార్మికుల నిరసన 

 కమిటీ కన్వీనర్ గా పాకాల భిక్షపతి, కో కన్వీనర్లు అక్బర్ పాషా, నిమ్మ నర్సిరెడ్డి, సుతారి రమేశ్, కార్యదర్శిగా బంగారు ఐలయ్య, సహాయ కార్యదర్శులుగా గుడ్ల బాబు, సూర్ణ శ్రీనివాస్, బింగి కర్రోళ్ల కర్ణాకర్, చీర్ల లక్ష్మయ్య, కోశాధికారిగా బంగారి ప్రమోద్ కుమార్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.  కార్యక్రమంలో జేసీ మండల కో కన్వీనర్ కొంగరి వెంకట మావో, జేఏసీ సాంస్కృతిక విభాగం కన్వీనర్ ఎం.చందు, జి. శ్రీనివాస్, పి.యాదగిరి, బి. నర్సిరెడ్డి, గ్రామస్తులు  పాల్గొన్నారు.