వరంగల్ : తహసీల్దార్ విజయారెడ్డి హత్యకు నిరసనగా వరంగల్ లో రెవెన్యూ ఉద్యోగుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లా కలెక్టరేట్ల ముందు ఉద్యోగులు మౌనదీక్ష చేశారు.
రెవెన్యూ ఉద్యోగులపై దాడులను అరికట్టాలని, ఎమ్మార్వో కార్యాలయాల వద్ద పోలీస్ ప్రొటక్షన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలపై ప్రభుత్వం చర్చలు జరపాలంటున్నారు రెవెన్యూ ఉద్యోగులు.