రెవెన్యూ JAC ఏర్పాటు.. KTRతో భేటీకి నిర్ణయం

రెవెన్యూ JAC ఏర్పాటు.. KTRతో భేటీకి నిర్ణయం

హైదరాబాద్ :  రాష్ట్ర రెవెన్యూ శాఖ ఉద్యోగులు జాయింట్ యాక్షన్ కమిటీ- JACని ఏర్పాటు చేశారు. JAC చైర్మన్ గా వంగా రవీందర్ రెడ్డిని ఎన్నుకున్నారు. సెక్రెటరీ జనరల్ గా గోల్కొండ సతీష్ ఎంపికయ్యారు. రెవెన్యూ శాఖలో సంస్కరణలు చేయాలని ఎప్పటి నుంచో కోరుతున్నామనీ… కానీ ఉద్యోగులకు ఇబ్బంది కలిగే పరిస్థితి వస్తే మాత్రం పోరాటం చేస్తామని చెప్పారు. కొత్త రెవెన్యూ చట్టం తెస్తే ఆహ్వానిస్తాం కానీ… కానీ ఉద్యోగులకు భవిష్యత్ పై ప్రభుత్వం భరోసానివ్వాలన్నారు.

బుధవారం కేటీఆర్ ను కలవాలని నిర్ణయం

రేపు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలవాలని నిర్ణయించినట్టు రెవెన్యూ ఉద్యోగులు చెప్పారు. ప్రగతి భవన్ లో కేటీఆర్ జరిగే సమావేశంలో… రెవెన్యూ ఉద్యోగుల సమస్యలపై చర్చిస్తామన్నారు. ఆ తర్వాత తమ భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు ఉద్యోగులు.