వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో భూ భారతి మాకు రెఫరండమే

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో భూ భారతి మాకు రెఫరండమే
  • గతంలో నలుగురి కోసం ధరణి చట్టం తెచ్చిండ్రు: పొంగులేటి శ్రీనివాస్
  • మేం ప్రజల అభిప్రాయాలు తీసుకొని చట్టం చేశామని వెల్లడి
  • భూ భారతి, రైతు భరోసాకు మండలి ఆమోదం

హైదరాబాద్, వెలుగు: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో భూ భారతి చట్టం మాకు రెఫరండమేనని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో ధరణితో వేల మంది ప్రాణాలు కోల్పోయారని ఆయన గుర్తు చేశారు. ధరణితో గత సీఎం కేసీఆర్ సృష్టించిన విధ్వంసం రాష్ట్ర ప్రజలు కళ్లారా చూశారని, అందరికి తెలిసిందే అన్నారు. శనివారం శాసనమండలిలో భూభారతి బిల్లును పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రవేశపెట్టగా, రైతు భరోసాపై చర్చను వ్యవసాయ మంత్రి తుమ్మల ప్రవేశపెట్టారు. 

ఆలస్యం కావటంతో రైతు భరోసాపై చర్చ జరపకుండానే మండలి ఆమోదం తెలిపింది. అంతకుముందు బిల్లు ప్రవేశపెట్టే సమయంలో మంత్రి పొంగులేటి బిల్లు వివరాలను సభ్యులకు వెల్లడించారు. “గత నియంతృత్వ ప్రభుత్వం నలుగురి కోసం ఒకరిద్దరు కలిసి ధరణి చట్టాన్ని తయారు చేస్తే.. ఈనాటి ఇందిరమ్మ ప్రభుత్వం ప్రజల అభిప్రాయాలను.. ఆలోచనలను.. సూచనలను.. సలహాలను.. తీసుకొని ఈ చట్టాన్ని రూపొందించింది. ఈ బిల్లును చూసి బీఆర్ఎస్ నేత‌‌‌‌ల‌‌‌‌కు క‌‌‌‌న్నుకుట్టింది. ప్రజామోదం పొందిందన్న ఉక్రోషం వారికి నిద్ర ప‌‌‌‌ట్టనీయ‌‌‌‌డం లేదు. అందుకే శాస‌‌‌‌న‌‌‌‌స‌‌‌‌భ‌‌‌‌లో గ‌‌‌‌లాటా చేశారు. అయితే ప్రజ‌‌‌‌ల‌‌‌‌కు వీరి క‌‌‌‌ప‌‌‌‌ట నాట‌‌‌‌కం అర్థమ‌‌‌‌యింది. ఈ భూభార‌‌‌‌తి పూర్తిగా అమ‌‌‌‌లులోకి వ‌‌‌‌స్తే బీఆర్ఎస్ పెద్దలు దోచుకున్న భూముల వివ‌‌‌‌రాలు బ‌‌‌‌య‌‌‌‌ట‌‌‌‌ప‌‌‌‌డ‌‌‌‌తాయి. అప్పుడు చట్టం పవర్ ఏంటో తెలుస్తుంది. దేశంలోని 18 రాష్ట్రాలలో ఉన్న ఆర్ఓఆర్ చట్టాలను స్టడీ చేసి ఈ కొత్త చట్టానికి ప్రాణం పోశాం. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం, నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని తిరుమలగిరి మండలంలో పైలట్ ప్రాజెక్టు నిర్వహించాం. రాష్ట్రవ్యాప్తంగా ప్రజల నుంచి విస్తృతస్థాయిలో అభిప్రాయాలు, సూచనలు, సలహాలు స్వీకరించాం. ఈ బిల్లు దేశానికే దిక్సూచిగా ఉంటుంద‌‌‌‌ని చెప్పడానికి గర్వపడుతున్న. ఒక రోల్ మోడల్ గా ఈ చట్టం ఉండబోతుంది” అని మంత్రి స్పష్టం చేశారు.

వీఆర్ఏలను రెవెన్యూలోకే తీసుకోవాలి: జీవన్​రెడ్డి

కాంగ్రెస్​ ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి మాట్లాడుతూ ధరణితో లక్షలాది ఫిర్యాదులు పరిష్కారం కాకుండా ఉన్నాయని, భూ భారతి వల్ల సత్వర పరిష్కారం లభిస్తుందన్న నమ్మకం ఉందన్నారు. ఆన్​లైన్​లోనే కాకుండా ఆఫ్​లైన్​లోనూ ఫిర్యాదులు చేసుకునే అవకాశం కల్పించాలన్నారు. ధరణి రావడంతో దాదాపు 30వేల మంది వీఆర్​ఓ, వీఆర్ఏలను వేరే శాఖకు బదిలీ చేశారని అన్నారు. తిరిగి వారిని తీసుకోవాలి లేదా కొత్త వారికి అవకాశం కల్పించాలన్నారు. కాంగ్రెస్ సభ్యుడు బల్మూరి వెంకట్ మాట్లాడుతూ భూ భారతి వంద శాతం పారదర్శకంగా ఉంటుందన్న నమ్మకం వ్యక్తం చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్ భూముల రికార్డులు సులభంగా దొరుకుతాయన్నారు. కూకట్​పల్లి మండలంలోని షంషిగూడలో గతంలో పేదలకు ఇచ్చిన 60 గజాల భూముల రికార్డులు జీహెచ్​ఎంసీ, హెచ్​ఎండీఏ, రెవెన్యూలో రకరకాలుగా ఉన్నాయని, కొత్త చట్టంలో అయినా ఆ రికార్డులను సరిదిద్దాలన్నారు. ప్రొఫెసర్​కోదండరామ్​ మాట్లాడుతూ ధరణి ఏర్పాటుతో 47 రకాల సమస్యలు ఏర్పడ్డాయన్నారు. చాలా భూములు రికార్డు కాలేదన్నారు. చాలా మంది రైతులు భూములు కోల్పోయారు. కొన్ని కేసులు పరిష్కారం కాక చాలా మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు. వేలాది కేసులు పరిష్కారం కాకుండా ఉన్నాయన్నారు. కొత్త చట్టం భూ భారతి అన్ని సమస్యలు పరిష్కరిస్తుందన్న నమ్మకం ఉందన్నారు.