ఒలంపిక్స్ లక్ష్యంగా క్రీడలకు ప్రాధాన్యత : పొంగులేటి శ్రీనివాసరెడ్డి

 ఒలంపిక్స్ లక్ష్యంగా క్రీడలకు ప్రాధాన్యత : పొంగులేటి శ్రీనివాసరెడ్డి
  • మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

వైరా, వెలుగు :  ఒలంపిక్స్ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యత ఇస్తోందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి  శ్రీనివాసరెడ్డి అన్నారు. సోమవారం వైరా సాంఘిక సంక్షేమ బాలికల గురుకులంలో 10వ జోనల్ స్థాయి జోనల్ స్పోర్ట్స్ మీట్-2024ను వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ తో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో నాలుగు రోజులపాటు జరిగే జోనల్ స్థాయి క్రీడల్లో విద్యార్థులు క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలన్నారు.

సంక్షేమ గురుకులాలు భవిష్యత్​లో ఇంటిగ్రేటెడ్ గురుకులాలుగా మరింత నాణ్యమైన విద్యను అందిస్తాయని తెలిపారు.  సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ జాయింట్ సెక్రటరీ కంభంపాటి శారద గురుకుల క్రీడా ప్రతిభను వివరించారు. ఎమ్మెల్యే  మాలోత్ రాందాస్ నాయక్ మాట్లాడుతూ వైరా నియోజకవర్గాన్ని క్రీడల్లో ముందుకు తీసుకుపోవడానికి కృషి చేస్తామన్నారు. ముందుగా జోనల్ స్పోర్ట్స్ మీట్ ప్రారంభ సూచికగా జాతీయ జెండా, ఒలంపిక్స్, జోనల్ క్రీడా పతాకాలను ఖమ్మం కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ తో కలిసి మంత్రి, ఎమ్మెల్యే  ఎగురవేశారు. అనంతరం క్రీడాజ్యోతిని వెలిగించారు. 

ఈ కార్యక్రమంలో 4వ జోనల్ ఆఫీసర్ కొప్పుల స్వరూపారాణి,  జోనల్ స్పోర్ట్స్ మీట్ వివరాల ఇన్​చార్జి కే.శ్రీదేవి, ప్రిన్సిపాల్ డాక్టర్ డీ.సమత, గురుకుల ప్రిన్సిపాల్స్ చావా జ్యోతి, ఎం. పద్మావతి, పీవీ పద్మావతి, జ్యోతి లిల్లీ, విజయదుర్గ, విజయ్ కుమారి, మైథిలి, ఎం.స్వరూప రాణి, బక్క నాగేశ్వరరావు రిణాధారి, కుసుమ, శివకుమారి, విజయ, రామ్మోహన్ రెడ్డి, టి. సాయి కిరణ్ పాల్గొన్నారు.  కాగా తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి ఉద్యమకారుల సంక్షేమానికి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని టీయూఎస్​ నాయకులు మంత్రి పొంగులేటికి వినతి పత్రం అందజేశారు.