ట్యాక్స్‌ కట్టడం లేదని ప్రైవేటు స్కూల్‌ గేట్‌కు తాళం

ట్యాక్స్‌ కట్టడం లేదని ప్రైవేటు స్కూల్‌ గేట్‌కు తాళం

ఆర్మూర్, వెలుగు:  రూ.5.50 లక్షల ప్రాపర్టీ ట్యాక్స్‌ కట్టడం లేదని ఆర్మూర్ మున్సిపల్ రెవెన్యూ టీం బుధవారం ఓ ప్రైవేటు స్కూల్ బిల్డింగ్ గేటుకు తాళం వేశారు.  ఆర్మూర్ టౌన్‌లోని ఓ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం ప్రాపర్టీ టాక్స్ రూ.5.50  లక్షలు మున్సిపల్‌కు చెల్లించాల్సి ఉంది.

 మూడుసార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ  ట్యాక్స్ చెల్లించకపోవడంతో మున్సిపల్ రెవెన్యూ ఆఫీసర్ అయం ఆధ్వర్యంలో స్కూల్ బిల్డింగ్ గేటుకు తాళం వేసి సీజ్ వే శారు.  కార్యక్రమంలో మున్సిపల్ రెవెన్యూ బృందం పాల్గొన్నారు.