![హైడ్రా తగ్గేదేలా : హైదరాబాద్ నిజాంపేటలో అక్రమంగా నిర్మించిన ఇళ్లు, షాపులు కూల్చివేత](https://static.v6velugu.com/uploads/2025/02/revenue-officials-demolish-houses--kukatpally-nizampet_srE8v9zjdH.jpg)
హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ అధికారులు కొరడా జులిపిస్తున్నారు. మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని జర్నలిస్ట్ కాలనీ సమీపంలో ఇళ్లను కూల్చివేశారు రెవెన్యూ అధికారులు. సర్వే నెంబర్ 334 ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మించిన కట్టడాలను కూల్చేస్తున్నారు. పదేళ్ల నుంచి ఉంటున్నామని.. కనీసం చెప్పకుండా, సమయం కూడా ఇవ్వకుండా కూల్చేశారని కన్నీళ్లు పెట్టుకున్నారు బాధితులు. అడ్డు వచ్చిన వారిన పోలీసులు తీసుకెళ్తున్నారు.
Also Read : కులగణన సర్వే ఫారాలు పంపినం
ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి నిర్మించిన కట్టడాలను పోలీసుల బందోబస్తు మధ్య జేసీబీ సహాయంతో తూతూ మంత్రంగా కూల్చివేశారు. స్థానిక కాంగ్రెస్ నాయకులు అడ్డుకోవడంతో రెవెన్యూ అధికారులు కూల్చివేతలను నిలిపి వేశారు. ఈ నిర్మాణాలన్ని ఎమ్మార్వో పూల్ సింగ్ ఉన్న సమయంలో నే జరిగినట్లు తెలుస్తుంది..మరో వైపు కవరేజ్ చేస్తున్న మీడియా పట్ల బాచుపల్లి ఆర్ఐ భానుచందర్ దురుసుగా ప్రవర్తించారు.కమర్షియల్ వాటిని ఇప్పుడు కూల్చి వేస్తామని .. రెండు రోజులు సమయం ఇస్తామని ఎమ్మార్వో పూల్ సింగ్ చెప్పడం గమనార్హం.