
హైదరాబాద్: మేడ్చల్ మల్కిజిగిరి జిల్లా మేడిపల్లి మండలం పీర్జాదిగూడలో అక్రమ నిర్మాణాలను ఇవాళ రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. సాయి ప్రియా కాలనీలోని సాలార్జంగ్ కంచెలోని సర్వే నంబర్ 1, 10, 11లో ఉన్న సీలింగ్ భూములను కొన్ని సంవత్సరాల క్రితం రియల్ ఎస్టేట్ వ్యాపారలు ఇంటి భూములుగా అమ్మడంతో కొందరు భూమి కొన్నారు. అయితే సీలింగ్ ల్యాండ్‌లో గతంలో ఉన్నవాటికి మాత్రమే 118 జీవో అమలవుతుందని తెలపడంతో కొందరు అప్పట్లో నిర్మాణాలు చేపట్టారు.
ALSO READ :-సీఎం రేవంత్ కు గుడి.!.మార్చి 19న శంకుస్థాపన
ప్రభుత్వ భూమిలో కట్టడాలు చేపట్టారని తహసీల్దార్ గతంలో కూల్చివేతలు చేపట్టగా అప్పుడు బాధితులు కోర్టును ఆశ్రయించారు.దీంతో కోర్టు కేసు ఉన్నవాటిని కాకుండా మిగతా వాటిని ఇవాళ ఉదయం రెవెన్యూ సిబ్బంది పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేశారు. జీవో 118ను సవరించి తమకు న్యాయం చేయాలని బాధితులు వేడుకున్నారు.