లంచం తీసుకుంటూ పట్టుబడిన కడెం ఎమ్మార్వో, డిప్యూటీ ఎమ్మార్వో

రూ. 9 వేలు తీసుకుంటూ చిక్కిన వైనం

నిర్మల్ జిల్లాలో లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులు అడ్డంగా దొరికారు రెవెన్యూ అధికారులు. భూమిని పట్టా చేసేందుకు రైతు నుంచి లంచం అడిగిన ఎమ్మార్వో, డిప్యూటీ ఎమ్మార్వో  రైతు నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. 

నిర్మల్ జిల్లా కడెం మండలం కొత్త మద్దిపడగ గ్రామానికి చెందిన రైతు తన భూమి పట్టా కోసం కొన్ని రోజులుగా రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా భూమి పట్టా కాలేదు. పట్టాకోసం అధికారుల అడిగితే రూ. 15వేలు లంచం డిమాండ్ చేశారు.

బుధవారం (జనవరి 10) రైతు నుంచి ఎమ్మార్వో రాజేశ్వరి, డిప్యూటీ ఎమ్మార్వో చిన్నయ్య మొదటి విడతగా రూ. 9వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.