
సెబీ (సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) కొత్త ఛైర్మన్‌గా ఆర్థిక కార్యదర్శి తుహిన్ కాంత పాండే నియామకాన్ని క్యాబినెట్ నియామకాల కమిటీ ఆమోదించింది. పాండే మూడేళ్లపాటు ఈ పదవిలో ఉంటారు. ఫిబ్రవరిలో మాధవి పూరి బుచ్ పదవీకాలం ముగియనుండటంతో ఆమెస్థానంలో తుహిన్ పాండే బాధ్యతలు చేపడతారు.
ఒడిశా కేడర్‌కు చెందిన 1987 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన పాండే గతంలో ఆర్థిక కార్యదర్శిగా, రెవెన్యూ కార్యదర్శిగా పనిచేశారు. ఎయిరిండియా ప్రైవేటీకరణలో పాండే కీలక పాత్ర పోషించారు. తుహిన్ కాంత పాండేకు ఫైనాన్స్, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్‌లో విస్తృత అనుభవం ఉంది.