నిజామాబాద్, వెలుగు: జిల్లాలో 4600 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగయ్యేలా లక్ష్యం నిర్ధేశించామని, అందుకు తగ్గట్లు కార్యాచరణ సిద్ధం చేయాలని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు తెలిపారు. బుధవారం ఆయన కలెక్టరేట్లో వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులతో ఖరీఫ్సీజన్సన్నద్ధతపై రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్మాట్లాడుతూ.. పదిహేను రోజుల్లో వర్షాకాలం పంటల సాగు హడావుడి మొదలవుతుందని, రైతులకు వచ్చే ప్రతీ అనుమానాన్ని నివృత్తి చేసేలా విస్తరణ అధికారులు అందుబాటులో ఉండాలని సూచించారు.
రైతు వేదికల వద్ద వారంలో నాలుగు రోజులు రైతులను కలువాలన్నారు. విత్తనాలు, ఎరువులు, పంటల ఎంపిక అంశాలపై అవగాహన కల్పించాలని సూచించారు.33 వేల టన్నుల యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని, యూరియా వినియోగాన్ని ఈ–పాస్‌లో విధిగా నమోదు చేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా అగ్రికల్చర్ఆఫీసర్తిరుమల ప్రసాద్, ఉద్యానవన శాఖ అధికారి నర్సింగ్‌రావు
పాల్గొన్నారు.