రివ్యూ: ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ
రన్ టైమ్: 2 గంటల 28 నిమిషాలు
నటీనటులు: నవీన్ పోలిశెట్టి,శృతి శర్మ, సుహాస్ తదితరులు
సినిమాటోగ్రఫీ: సన్నీ కూరపాటి
మ్యూజిక్: మార్క్ రాబిన్
స్క్రీన్ ప్లే: నవీన్ పొలిశెట్టి,స్వరూప్ ఆర్.జె.ఎస్
నిర్మాత: రాహుల్ యాదవ్ నక్కా
కథ,మాటలు,దర్శకత్వం: స్వరూప్ ఆర్.జె.ఎస్
రిలీజ్ డేట్: జూన్ 21,2019
కథేంటి?
చిన్నపాటి డిటెక్టివ్ గా నెల్లూరు కేసుల్ సాల్వ్ చేసే ఆత్రేయ (నవీన్) ఓ పెద్ద కేసు కోసం వెయిట్ చేస్తుంటాడు. ఓ రోజు పోలీసులు ఒక కేసులో అనుమానంతో అతన్ని జైల్లో వేస్తారు.ఆ రోజు ఓ వ్యక్తి తన కూతురు మిస్ అయిందని బాధతో చెప్తాడు.ఆ కేసును సాల్వ్ చేస్తే కెరీర్ సెట్ అవుతుందని మొదలుపెడతాడు ఆత్రేయ.కానీ దాని వల్ల అనసవరమైన చిక్కుల్లో పడాల్సి వస్తుంది.అసలు ఆ కేసు ఏమైంది.దాని ఆత్రేయ ఎలా సాల్వ్ చేశాడన్నది కథ.
నటీనటుల పర్ఫార్మెన్స్
నవీన్ పొలిశెట్టి మంచి యాక్టర్.ఇంతకు ముందు బాలీవుడ్ లో కొన్ని వెబ్ సిరీస్ లల్లో నటించిన నవీన్ కు ఇదే హీరోగా డెబ్యూ. తన యాక్టింగ్ స్కిల్స్ సినిమాకు మేజర్ ప్లస్ అయ్యాడు.తన న్యాచురల్ పర్ఫార్మెన్స్ తో ఇంప్రెస్ చేశాడు.హీరోయిన్ శృతి శర్మ కు మంచి రోల్ దక్కింది.తను కూడా బాగా చేసింది.మిగతా నటీనటులు వాళ్ల పరిధిలో బాగా చేశారు.
టెక్నికల్ వర్క్:
సన్నీ కూరపాటి సినిమాటోగ్రఫీ నీట్ గా బాగుంది.మార్క్ రాబిన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సీన్లను బాగా ఎలివేట్ చేసింది.సౌండ్ డిజైన్ కొత్తగా ఉంది.ఎడిటింగ్ లో లోపాలున్నాయి.సినిమాలో కొన్ని సీన్లు లేపేయాల్సింది.లెంగ్త్ ఎక్కువైన ఫీల్ ఉంది.ఆర్ట్ వర్క్ బాగుంది.డైరెక్టర్ స్వరూప్ కథకు సంబంధించిన డీటెయిల్స్ ను బాగా కలెక్ట్ చేసుకున్నాడు.డైలాగులు ఎంటర్ టైనింగ్ గా ఉన్నాయి.
విశ్లేషణ:
‘‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’’ ఓ కొత్త తరహా ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్.నటీనటుల పర్ఫార్మెన్స్,టెక్నికల్ వర్క్,స్క్రీన్ ప్లే,డైరెక్షన్ ఇలా అన్నీ ఈ సినిమాకు చక్కగా కుదిరాయి. ఇన్వెస్టిగేషన్ మూవీస్ అంటే పోలీసాఫీసర్ నేపథ్యంలో ఎక్కువ మూవీస్ తీస్తారు.కానీ ఈ సినిమాకు ఓ కామెడీ డిటెక్టివ్ ను ఎంచుకోవడం ఎక్కువ సక్సెస్ అయ్యారు మేకర్స్. చిరంజీవి ‘‘చంటబ్బాయి’’ టోన్ లో ఈ సినిమా ఫన్ గా మొదలవుతుంది..మొదట్లో సెట్ అవ్వడానికి కాస్త టైమ్ తీసుకున్నప్పటికీ..నవీన్ పొలిశెట్టి కామెడీ టైమింగ్,పర్ఫార్మెన్స్ తో ఫస్టాఫ్ అంతా బాగా ఎంటర్ టైన్ చేస్తాడు.అసలు పాయింట్ మొదలైన తర్వాత సెకండాఫ్ లో డైరెక్టర్ స్వరూప్ మేజిక్ చేశాడు.ఊహించని ట్విస్టులు,టర్న్ లతో సినిమాకు హుక్ అయ్యేలా చేశాడు.కొత్త డైరెక్టరే అయినప్పటికీ ఎక్కడా తడబడకుండా,లాజిక్ లు మిస్ అవ్వకుండా కథను బాగా డీల్ చేశాడు.కథకు అవసరమైన డీటెయిలింగ్ అంతా చక్కగా ప్రెజెంట్ చేశాడు.కథలో ప్రేక్షకులు ఇన్వాల్వ్ చేసేందుకు హీరో లైఫ్ కు,ఆ ఇన్సెస్టిగేషన్ కు సంబంధం ఉండేలా రాసుకోవడం మెచ్చుకునే అంశం.క్రైమాక్స్ డ్రాగ్ అనిపిస్తుంది..డీటెయిలింగ్ కూడా మరీ ఎక్కువిచ్చినట్టు అనిపిస్తుంది.తద్వారా ప్రేక్షకుడి మెదడుకు ఎక్కువ పని చెప్పినట్టు అనిపిస్తుంది.ఇలాంటి కంప్లయింట్ తప్పిస్తే.. ఓవరాల్ గా ఈ ‘‘ఏజెంట్’’ ఎంటర్ టైన్ చేయడమే కాకుండా ఆలోచింప చేస్తాడు.
బాటమ్ లైన్: ఆకట్టుకునే ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్.