వచ్చే నెల జూలైలో జరగబోయే బోనాల జాతరను ఘనంగా జరిపించేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతుంది. జూబ్లీహిల్స్ ఎంసీహెచ్ఆర్ డిలో బోనాల పండుగ ఏర్పాట్లపై రివ్యూ మీటింగ్ జరిగింది. ఆషాఢ మాసం బోనాలు పండుగ ఘనంగా ఏర్పాట్లు చేసేందుకు ప్రభుత్వం అన్ని శాఖలతో మీటింగ్ జరిగింది. దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులకు దిశానిర్ధేశం చేశారు.
ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయ లక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి , రాజ్యసభ సభ్యులు అనిల్ యాదవ్ ,వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. ఆషాఢ మాసం బోనాల జాతర ను విజయవంతం చేసుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలు , శాంతి భద్రతలు ,దేవాలయాల వద్ద భక్తులకు చేయాల్సిన ఏర్పాట్లు తదితర అంశాల పై సమీక్షా సమావేశంలో చర్చించారు.