
ములుగు, వెలుగు : చిన్నారులకు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో చేపట్టాలని ములుగు కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో సోమవారం మిషన్ ఇంద్రధనస్సు కార్యక్రమంపై రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వ్యాక్సినేషన్ ద్వారానే అనేక వ్యాధులను నివారించవచ్చన్నారు. ఆగస్టు 7 నుంచి 12 వరకు వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టనున్నట్లు చెప్పారు. రెండేళ్లలోపు పిల్లలందరికీ వ్యాక్సిన్ వేయాలని ఆదేశించారు. భారీ వర్షాలు పడుతున్నందున ఆఫీసర్లు అలర్ట్‌గా ఉండాలని చెప్పారు. డ్రైనేజీల్లో చెత్త పేరుకపోకుండా చూడాలన్నారు.
ఆయా కార్యక్రమాల్లో జడ్పీ సీఈవో ప్రసూనరాణి, డీఎంహెచ్‌వో విపిన్, ప్రోగ్రాం ఆఫీసర్ పవన్‌కుమార్, మాస్ మీడియా ఇన్‌చార్జి బి.తిరుపతయ్య, హెచ్‌ఈ సంపత్, భాస్కర్, ఏటీడీవో దేశిరం, పశు సంవర్ధక శాఖ అధికారి విజయభాస్కర్, డీఆర్డీవో నాగపద్మజ, సీపీవో ప్రకాశ్ పాల్గొన్నారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ వైవీ.గణేస్, ఆర్డీవో కె.సత్యపాల్‌రెడ్డితో కలిసి గ్రీవెన్స్‌కు హాజరై ప్రజల నుంచి అర్జీలు తీసుకున్నారు. ములుగు కలెక్టర్‌గా చార్జ్ తీసుకున్న ఇలా త్రిపాఠిని సోమవారం టీఎన్‌జీవోస్ లీడర్లు కలిసి బొకే అందజేసి, శాలువాతో సన్మానించారు. టీఎన్‌జీవోస్ జిల్లా అధ్యక్షుడు ఠాకూర్ జ్ఞానేశ్వర్, కార్యదర్శి పోలు రాజు, ట్రెజరర్ భూక్యా లాల్, వైస్ ప్రెసిడెంట్ మహేందర్, కుమారస్వామి పాల్గొన్నారు.
**********