అమరావతికి పునర్వైభవం.. కనుల విందుగా విద్యుత్ దీపాలు..

2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ మూడు రాజధానుల అంశం తెరపైకి తేవటంతో అప్పటివరకు రాజధానిగా ఉన్న అమరావతి ప్రాధాన్యత కోల్పోయింది. అప్పటి సీఎం జగన్ నిర్ణయంతో అమరావతిలో పనులు ఎక్కడిక్కడ నిలిచిపోయాయి. దీంతో రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టారు. ఆ తర్వాత 2024ఎన్నికల్లో చంద్రబాబు సారథ్యంలో ఏర్పడ్డ కూటమి ఘనవిజయం సాధించిటంతో అమరావతికి మళ్ళీ కల వచ్చింది.

తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమరావతినే రాజధానిగా కొనసాగిస్తామని చంద్రబాబు హామీ ఇవ్వటంతో రాజధానికి పునర్వైభవం వచ్చింది. మొన్నటి దాకా చీకటిగా అమరావతి రోడ్లు ఇప్పుడు విద్యుత్ దీపాలతో వెలిగిపోతున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చాక అమరావతిలో అభివృద్ధి పనులు ఊపందుకున్నాయి. నిన్నటిదాకా చీకట్లో ఉన్న సీడ్ యాక్సెస్ రోడ్డు ఇప్పుడు వీధి దీపాల కాంతిలో వెలిగిపోతోంది. ఇందుకు సంబందించిన ఫోటో నెట్టింట వైరల్ అయ్యింది.